నోటి బలుపుతో అనిల్ మాట్లాడుతున్నారు: జవహర్

  • ఈ ఉదయం లోకేశ్ పై విమర్శలు గుప్పించిన అనిల్ కుమార్ యాదవ్
  • లోకేశ్ పై అవాకులు, చెవాకులు పేలటాన్ని మానుకోవాలన్న జవహర్
  • లోకేశ్ తాత, తండ్రి గురించి మాట్లాడే అర్హత లేదని మండిపాటు
దమ్ముంటే నారా లోకేశ్ తనపై గెలవాలంటూ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఎలాంటి రాజకీయ చరిత్ర లేని కుటుంబం నుంచి వచ్చిన తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని... తాత, తండ్రి సీఎంగా ఉన్న నారా లోకేశ్ ఒక్కసారి కూడా గెలవలేదని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు అనిల్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత జవహర్ మండిపడ్డారు. నోటి బలుపుతో అనిల్ మాట్లాడుతున్నారని విమర్శించారు. 

లోకేశ్ తాత, తండ్రి గురించి మాట్లాడే అర్హత అనిల్ కు లేదని జవహర్ అన్నారు. లోకేశ్ అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి అని... ఆయన ఆలోచనలు అనిల్ లాంటి బజారు మనుషులకు అర్థం కావని విమర్శించారు. లోకేశ్ పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి మతి భ్రమించి అనిల్ మాట్లాడుతున్నారని అన్నారు. నెల్లూరుకు అనిల్ చేసిందేమిటో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రిగా రాష్ట్రానికి అనిల్ చేసిందేమీ లేదని విమర్శించారు. లోకేశ్ పై అవాకులు, చెవాకులు పేలటాన్ని మానుకోవాలని సూచించారు.

Jawahar
Telugudesam
Anil Kumar Yadav
YSRCP

More Telugu News